కోల ఆదిత్య సంవత్సరీకం…
హాజరైన ప్రముఖులు

తిమ్మాపూర్, జూలై 6 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లోని శ్రీపురం కాలనీకి చెందిన ప్రముఖ ఇంజనీర్, అలయన్స్‌క్లబ్ బాధ్యులు, రెడ్‌క్రాస్ సోసైటి కార్యవర్గసభ్యులు,రేకుర్తి కంటి ఆసుపత్రి నిర్వహణ కమిటి బాధ్యులు, లయన్స్‌క్లబ్ బాధ్యులు ఇంజనీర్ కోల అన్నారెడ్డి కుమారుడు అదిత్యరెడ్డి గత సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కంబడకోనే జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన సంవత్సరీకాన్ని గురువారం పెద్దపల్లి బైపాస్‌రోడ్‌లోని శివశాంతి శిల్పకళా గార్డెన్స్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, గంగుల కమలాకర్ సతీమణి, మాజీ ఎమ్మేల్సీ టి. సంతోష్ కుమార్, బిరుదు రాజమల్లు, కొండూరి సత్యనారాయణ గౌడ్, వుచ్చిడి మెహన్‌రెడ్డి, అర్భన్ బ్యాంక్ చైర్మెన్ కర్ర రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మినర్సింహారావు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, నాయకులు జోగినపల్లి రవీంర్ రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కరీంనగర్ డెయిరీ చైర్మెన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, మాజీ డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, కార్పోరేటర్లు కోల మాలతి ప్రశాంత్, వంగల శ్రీదేవి పవన్‌కుమార్, గుగ్గిళ్ల జయశ్రీ, ఎసిపీ తుల శ్రీనివాస్ రావు, సిఐ ధామెధర్‌ర రావు, ప్రముఖ డాక్టర్లు సూర్యనారాయణరెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, దారం రఘురాం, తంగెడ మురళీధర్‌రావు, రెడ్‌క్రాస్ సోసైటి బాధ్యులు పి. కేశవరెడ్డి, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, పి.శ్రీహరిరెడ్డి, బోడ సుధాకర్, గ్రానేడ్ పరిశ్రమ యాజమానులు వేణుగోపాల్ కర్వా, భగవాన్ దాస్ కర్వా, గంగుల సుధాకర్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, వివిధ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గోని ఆదిత్య చిత్ర పటానికి పూలమాలు సమర్పించి నివాళ్ళర్పించి అన్నారెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.