పిచ్చి కొండమ్మ

  • తెలంగాణా కోసం మళ్ళీ పోరాడుదాం
  • ఎటు పోతుంది దేశం? ఎన్నిసార్లు అడగాలి?
  • అడుగడుగునా అంటుకునే అడుసును ఎలా కడగాలి?
  • మాటలతో అణగిపోతున్న సమస్యల్ని ఇక సమాధానాలతో ఎదుర్కోవాలి
  • కొండ సురేఖకు అయితే జూన్ 2 ఎందుకు జరుపుకుంటున్నామో కూడా తెలియదు.
  • గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రసంగించడం సిగ్గుచేటు…

హైదరాబాద్, జూన్ 3 (విశ్వం న్యూస్): తెలంగాణ ప్రజల పౌరుష ప్రతిఘటనకు చిహ్నంగా నిలిచిన మానుకోట ఘటనను మరువలేం. దశాబ్దాల పోరాటంతో, వేలాది మంది వీరుల బలిదానాలతో సాధించిన రాష్ట్రం నేడు దొంగల పాలలో చిక్కుకుంది. తెలంగాణా ఏర్పడిన రోజు కూడా గుర్తుపెట్టుకోలేని స్థాయికి దిగజారిన పాలకులు – ఇవే మన యధార్థ పరిస్థితులు. ఒక్కసారి “జై తెలంగాణ” అనటానికైనా ఈ రోజు అధికారంలో ఉన్నవారు వెనకాడుతున్నారు. ఉద్యమకారులపై దాడులు చేసిన చరిత్ర కలిగిన వారు – ముఖ్యమంత్రి సహా – ఇప్పుడు పాలనలో ఉన్నారు. పాత వలస పాలకుల పాదాల వద్ద ఒగ్గుతున్న వారు మన గడ్డపై ద్రోహం చేస్తున్నారని ఎలా సహించగలము?

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టినవారే ఈరోజు నేతలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గౌరవించని వారు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బురదలో పడ్డారు. వీరికి తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? బాధ్యత ఉందా? వలస పాలకులకు ఊడిగంచినవారికి, ఉద్యమంలో భాగం కాలేకపోయినవారికి మన త్యాగాలు ఏమాత్రం గుర్తుండవు. వారు Telangana Formation Day గౌరవించకపోవడం ఆశ్చర్యంగా ఏమీలేదు. సాటి మహిళపై నీచ ఆరోపణలు చేసిన నాయకురాలి నుంచీ మానవ విలువల్ని ఆశించడం నిస్సారం.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. లేదంటే,మన రాష్ట్రం మళ్లీ చంద్రబాబు పాలనలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బాబు తన శిష్యుడు రేవంత్ ద్వారా బిజెపి సహకారంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు కుట్రలు ముమ్మరం చేస్తున్నాడు. ఈ జూన్ 2 నుంచే మనం మరో ఉద్యమానికి సిద్ధపడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *