కోట శ్రీనివాసరావు భార్య
రుక్మిణి కన్నుమూత

హైదరాబాద్, ఆగస్టు 18 (విశ్వం న్యూస్): ప్రముఖ నటుడు, ఇటీవలే పరమపదించిన కోట శ్రీనివాస్‌రావు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన సతీమణి రుక్మిణి (75) అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.
జూలై 13న కోట శ్రీనివాస్‌రావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దాంతో నెల రోజులు గడవకముందే కుటుంబానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. అంతకుముందు 2010లో వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఇప్పుడు కోట భార్య కూడా మృతిచెందడం కుటుంబ సభ్యులను, అభిమానులను కలచివేసింది.
రుక్మిణి మృతి పట్ల సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. అంత్యక్రియలు ఈరోజే హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.