
- కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో గాయమయ్యింది. ఈ ఘటన అనంతరం తక్షణమే వైద్యుల సలహా తీసుకున్న కేటీఆర్‌కు, శరీరానికి మళ్లీ ఒత్తిడి కలగకుండా కొద్దిరోజులు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

వెన్నుపూసకు సంబంధించిన గాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు. గాయం మానిపోయే వరకు కేటీఆర్‌కు వర్కౌట్‌లు, శారీరక శ్రమ చేసే పనులను పూర్తిగా నివారించాలన్న సిఫారసులు చేశారు.
ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయనకు సమీప వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి తన సాధారణ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నారు.