రేపు ఖమ్మం జిల్లాకు కేటీఆర్

ఖమ్మం, ఫిబ్రవరి 25, 2026 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవనున్నట్లు సమాచారం.