బుద్ధనగర్ లో నార్ముల్ పాల డైరీని ప్రారంభించిన నేతలు

బుద్ధనగర్ లో నార్ముల్ పాల డైరీని ప్రారంభించిన నేతలు

పీర్జాదిగూడ, మార్చి 18 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం వెనకాల బుద్ధ నగర్ మెయిన్ రోడ్ లో నార్ముల్ పాల డైరీని ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, నార్ముల్ పాలు నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డిల చేతుల మీదుగా నార్ముల్ పాల డైరీ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ రంగారెడ్డి జిల్లాల నుండి 72,000 వేల పాల ఉత్పత్తిదారుల వ్యవసాయ రైతుల సహాయ సహకారాలతో నార్ముల్ పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాల బిజినెస్ చక్కగా కొనసాగుతుందని, ఈ నార్ముల్ పాలు పెరుగు తదితరహార పదార్థాలతో పీర్జాది గూడా కార్పొరేషన్ బుద్ధ నగర్ ప్రజలందరికీ మేలుజరుగాలని, మంచి రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నార్ముల్ పాల సంస్థ కో డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ఏజీఎం జీవీఎన్ రెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జె నరేష్జ్ బుద్ధ నగర్ నార్ముల్ పాలు, పెరుగు షాపు యాజమాన్యం బి నిఖిల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పలు డివిజన్ల నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరై ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *