ఆత్మ రక్షణకు కరాటే
నేర్చుకోండి:ఎస్సై ఆసిఫ్

హుజురాబాద్, మే 14 (విశ్వం న్యూస్) : ఆత్మ రక్షణకు కరాటే నేర్చుకోండి సమాజంలో ప్రతి ఒక్కరు అమ్మాయిలకు కరాటే అవసరం అని మాట్లాడిన ఎస్సై ఆసిఫ్ గారు మాట్లాడారు. గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలోసమ్మర్ కరాటే శిక్షణ ప్రారంభం పాఠశాలలో సెలవులు కాబట్టి ప్రతి రోజు ఉదయం కరాటే శిక్షణ ఇవ్వబడును జమ్మికుంట రోడ్డు హుజురాబాద్ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ఈరోజు ముఖ్య అతిథులు హుజురాబాద్ టౌన్ ఎస్సై మొహమ్మద్ ఆసిఫ్ గారి చేతుల మీదుగా సమ్మర్ కరాటే క్యాంప్ ప్రారంభించబడింది.

చందు పట్ల జనార్దన్ (పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు), మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్, న్యూ కాకతీయ స్కూల్ డైరెక్టర్ గోపాల్, మహాత్మ జ్యోతి రావు పూలే కమిటీ చైర్మన్ కొల్లిపాక సమ్మయ్య, కెసిఆర్ సేవాదళ్ టౌన్ ప్రెసిడెంట్ చందు, కొతూరి రమేష్ (అడ్వకేట్), కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తదితరులు పాల్గొన్నారు.