కొండగట్టుకు బయలుదేరిన
హనుమాన్ స్వాములు

వీణవంక, మే 12 (విశ్వం న్యూస్) : వీణవంక కేంద్రంలోని హనుమాన్ స్వాములు 21 రోజులు, 11 రోజులు దీక్ష పూర్తి అయిన సందర్భంగా, శుక్రవారం ఉదయం ఇరుముడి కట్టుకొని, సాయంత్రం ఐదు గంటలకు హనుమాన్ గుడి నుండి హనుమాన్ స్వాములు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తోరణం వరకు,కాలినడకన, ఇరుముడి ఎత్తుకొని, గురు స్వాముల, కన్నె స్వాములు, స్వాములందరూ,అంగరంగ వైభవంగా, భజన పాటలతో, సంతోష సంబరాలతో, శ్రీరామ, హనుమ స్మరణతో, జైశ్రీరామ్, జై హనుమాన్ అంటూ భక్తి పరవశంలో హనుమాన్ పాటలు పాడుతూ, వాహనాలకు పూజ చేసి, గ్రామ దేవతలకు, కులదేవతలకు, కుటుంబ సభ్యుల సమేతంగా కొబ్బరికాయలు కొట్టి, శ్రీ హనుమాన్ అంటూ భజన పాటలతో హనుమాన్ స్వాములందరూ మాల విరమణ కు, వేములవాడ, కొండగట్టు బయల్దేరారు.
మాలవిరమణ బయలుదేరిన స్వాములలో గురు స్వాములు ముష్క శ్రీనివాస్, ముద్దెర శ్రీనివాస్, మల్లెత్తుల సదానందం, కన్నె స్వాములు సాత్విక్ సాయి,ప్రమోద్, సాయి రణధీర్, అనిల్, స్వాములు చిన్నాల శ్రీకాంత్, గంట కుమార్, కుమారస్వామి, రంజిత్, వంశీ, కౌశిక్, సాయి, హరీష్, వంశీ, మహేష్, రాకేష్ లు తదితరులు పాల్గొన్నారు.