మేడ్చల్:ఏఐటీయూసీ రాష్ట్ర 3వ
మహాసభలను విజయవంతం చేయండి
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కె.పి.వివేకానందకు కరపత్రాలు అందజేత
మేడ్చల్, మే 17 (విశ్వం న్యూస్) : జూన్ 6,7వ తేదీన మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో జంగా లక్ష్మయ్య పంక్షన్ హాల్ నందు జరిగే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర 3వ మహా సభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మేడ్చల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈసందర్భంగా కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానందకు మహా సభల కరపత్రాలు అందజేసి మహా సభల విజయవంతానికి సహాకరించాలని కోరడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.యేసురత్నం, మందా వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బంది పక్షాన ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తూ 10వ పీఆర్సీ, 11వ పీఆర్సీ జీఓ. నెంబర్ 14 వేతనాలు పెంపు కోసం సిబ్బంది విదినిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిండలో అలుపెరుగని పోరాట పటిమ కలిగిన సంఘం ఎఐటియుసీ అని కొనియాడారు. నేటి కాలమాన పరిస్థితుల్లో మున్సిపల్ సిబ్బంది పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలు సరిపోక అనేక ఆర్ధిక ఇబ్బందులతో ప్రజల ఆరోగ్యాలే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని ప్రభుత్వం మాత్రం సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో భవిష్యత్తు ఉద్యమాల నిర్వహణ కోసం ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలు ఉద్యోగ, కార్మిక సిబ్బంది జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రవిచంద్ర, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు డా. రాములు తదితరులు పాల్గొన్నారు.