సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల వ్యూహాలపై మల్క కొమరయ్య దిశానిర్దేశం

సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల వ్యూహాలపై మల్క కొమరయ్య దిశానిర్దేశం

సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, జనవరి 30, 2026:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించడం, బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయంతో పనిచేయడం ద్వారా విజయాన్ని సాధించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించడంతో పాటు, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలపై బీజేపీ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ బీజేపీ టౌన్ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, రూరల్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సౌదరి మహేందర్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *