మల్లికార్జున్ మృతి బి.ఆర్.ఎస్ పార్టీకి తీరని లోటు

మల్లికార్జున్ మృతి బి.ఆర్.ఎస్ పార్టీకి తీరని లోటు

పూలమాల వేస్తున్న కాకులమర్రి లక్ష్మణ్ బాబు

రాష్ట్ర నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు

గోవిందరావుపేట, జనవరి 9 (విశ్వం న్యూస్) : మల్లికార్జున్ మృతి బాధాకరమని రాష్ట్ర నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జడ్పిటిసి తుమ్మల హరిబాబు పార్టీ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మల్లికార్జున్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మల్లికార్జున్ కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు 15 వేల రూపాయల నగదును టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ బాబు అందజేశారు. అనంతరం పసర గ్రామ జాతీయ రహదారిపై అతని అంతిమయాత్ర కొనసాగింది ఈ అంతిమయాత్రలో ములుగు జిల్లా నుండి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అతని కి కన్నీటి వీడ్కోలు పలికారు. మల్లికార్జున్ మరణం తెలంగాణ సమాజానికి తీరని నష్టమని వారు వాపోయారు ప్రజలలో ఎంతో చురుకుగా ఉండేవాడని ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రజలతో మమేకమ యెవాడని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు గై అశోక్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు సాయిబాబా తాటికొండ శ్రీనివాస్ నాయకులు కీర్తి రవి మునిగాల వెంకన్న మువ్వా రామారావు తుమ్మల శివ చనమల ఐలయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు తెలుగు పైడి మడిపల్లి శ్యామ్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటకృష్ణ సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి దాసరి సుధాకర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి చిట్టిబాబు యానాల ధర్మారెడ్డి మాజీ జెడ్పిటిసి ఉప్పు తలకోటి లక్నవరం మచ్చ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పులిగుజ్జు వెంకన్న బిజెపి మండల అధ్యక్షుడు మద్దినేని తేజరాజు ఏనుగు రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *