- ఏఐసీసీ ఎస్సి డిపార్ట్మెంట్ ఉత్తర్వులు, అవకాశం కల్పించిన నాయకత్వానికి ధన్యవాదములు – మల్యాల సుజిత్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.
కరీంనగర్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : దేశంలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నిర్మాణానికి, పార్టీ బలోపేతానికి తోడ్పడేవిధంగా ఏఐసీసీ రాజస్థాన్ ఉదయపూర్ నవసంకల్ప్ డిక్లరేషన్, ఛత్తీస్గఢ్ రాయపూర్ ప్లీనరీ సమావేశాల్లో చేసిన తీర్మానం ప్రకారం లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏఐసీసీ ఎస్సి డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు శ్రీ రాజేష్ లిలోథియా గారు తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులను పీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పంపారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గ సమన్వయకర్తగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ ని అధిష్టానం నియమించింది. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి, ఎస్సి డిపార్ట్మెంట్ జాతీయాధ్యక్షులు శ్రీ రాజేష్ లిలోథియా గారికి అలాగే తన నియామకానికి సహకరించిన మాజీ ఎంపీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, డీసీసీ అధ్యక్షులు శ్రీ డా.కవ్వంపెల్లి సత్యనారాయణ గారికి, ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం గారికి, ఎస్సి డిపార్ట్మెంట్ జాతీయ కోఆర్డినేటర్ శ్రీ డా.పులి అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే ఎన్నికలకు మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులను సంసిద్ధపరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు మల్యాల సుజిత్ కుమార్.