
- హైదరాబాద్‌కి మార్క్ శంకర్.. సింగపూర్ నుంచి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవా మరియు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్ Shamshabad విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని తన పాఠశాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ మార్క్ చికిత్స అనంతరం కోలుకొని భారతదేశానికి తిరిగొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ ఆరోగ్యంగా తిరిగి రావడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
