మూడురోజుల క్రితం పెళ్లి… కలలతో నిండిన జీవితానికి విషాదాంతం

చొప్పదండి, ఆగస్టు 9 (విశ్వం న్యూస్): వివాహ వేడుకల సందడి ఇంకా చెవుల్లో మోగుతుండగానే, పూలమాలల సువాసన ఇంకా వాడిపోకముందే, రుక్మాపూర్ గ్రామ యువతి ముద్దసాని అఖిల (23) జీవితం దారుణ ముగింపుకు చేరింది.

ధర్మపురి మండలానికి చెందిన రాజుతో ఆమె వివాహం జరిగినది కేవలం మూడు రోజుల క్రితమే. కోటి ఆశలు, లక్ష్యాలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన అఖిల ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదువుకోవాలన్న కలను సాకారం చేసుకునేందుకు ఈరోజు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో గల ‘అయాన్ డిజిటల్ జోన్’ కేంద్రంలో పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైంది.

పరీక్ష ముగిసిన కొద్ది సేపటికే, అఖిల ప్రాణం లేని శరీరం కనబడటంతో అందరూ షాక్‌కు గురయ్యారు. కూతురి పెళ్లి వేడుకలో చిరునవ్వులు పూసిన తల్లిదండ్రుల కళ్లలో ఇప్పుడు కన్నీటి జల్లు. జీవితమంతా మిగిలి ఉందని భావించిన భర్తకు, ఈ విషాదం మాటల్లో చెప్పలేనిది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రుక్మాపూర్, ధర్మపురి రెండు గ్రామాలూ ఈ ఆకస్మిక విషాదంతో విషాదసంద్రాలుగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *