మాస్ లీడర్.. రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డిది సిల్వర్ స్పూన్ రాజకీయం కాదు. కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ.. అందులో అనుభవం సంపాదిస్తూ.. తనకంటూ ఓప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుని మాస్‌లీడర్‌గా ఎదిగి తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారన్నది విశ్లేషకుల అభిప్రాయం.
హైదరాబాద్, జనవరి 14 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజెక్కించుకుంది. విజయ ఢంకా మోగించింది. తెలంగాణ ఇచ్చిన పదేళ్లు తర్వాత.. కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం దక్కింది. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. అంతేకాదు.. ఇప్పటివరకు మంత్రి పదవి చేపట్టకుండానే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అప్పటి తెలంగాణ జేఏసీలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పోరాటం చేసింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటిసారి ప్రభుత్వం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపెట్టిన ఏ ఒక్క రోజున ప్రభుత్వ ఉద్యోగులతో మంచిగా లేదు ఫ్రెండ్లీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండి జై చూపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లు జిపిఎఫ్ డిఏలు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏరియాస్ మరియు వివిధ రకాల సంబంధించిన బిల్లులన్నీ అన్నిటినీ కొన్ని సంవత్సరాలు నుండి పక్కకు పెట్టిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి ఈ మధ్యకాలంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలందరూ కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పిరని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలియజేశారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎంతో ఉద్యమం చేసిన అలాంటి వారికి ముస్లిం నాయకులకు నామినేట్ పోస్టులలో మొండి చేయి ఇచ్చిన ప్రభుత్వం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ముందు వరుసలో నిలబడి ప్రజలకు ఉద్యోగులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి వారి వారికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని గర్వంగా అని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.
ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ప్రభుత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల వారంలోనే జీతాలు మీయొక్క అకౌంట్లో పడ్డట్టు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడే పరిష్కారం అవుతాయని మాకు నమ్మకమని గత టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వెళ్తామని ప్రగతి భవన్ వరకు వెళ్లిన కూడా అపార్ట్మెంట్ ఇవ్వకుండానే తిరిగి పంపించిన ఘనత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కి దక్కింది. డైనమిక్ టైగర్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా ఎప్పటికీ అప్పుడే పరిష్కరిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో తన ఒక్క ఛాంబర్ లో ప్రతి ఒక్కరిని కలవడానికి వచ్చిన వారిని కలుస్తూ వారి యొక్క సమస్యలను తెలంగాణ రాష్ట్ర అధికారులకు వెంటనే పరిష్కరించడానికి ఆదేశాలుస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ప్రజలు అందరూ హర్షిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఇచ్చిన ఆరు హామీల నుండి రెండు హామీలను అప్పుడే ఆదేశాలు ఇస్తూ మిగిలిన హామీలు వంద రోజులలో అమలుపరస్తానని అంత ధైర్యంతో చెప్పిన డైనమిక్ టైగర్ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారు.
ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలతోపాటు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాలతో పాటు, జిల్లా డివిజన్ మండల స్థాయిలలో తీసుకుని వెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేయడానికి రాత్రి ప్రజలు ప్రయత్నిస్తామని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీలు వివిధ రకాల పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను కూడా అన్నిటిని మంజూరు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.