మేడారం జాతరకు
75 కోట్లు మంజూరు

- ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు గిరిజన జాతర
హైదరాబాద్, డిసెంబర్ 16 (విశ్వం న్యూస్) : మేడారంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ది పనుల కోసం.. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రూ.75 కోట్లు మంజూరు చేశారు.
సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం మూడు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నిధులు కేటాయించమని కోరిన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ.
మరోవైపు 2024 ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు గిరిజన జాతర జరుగుతుంది.