నాగారం PHCలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం

నాగారం PHCలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం

నాగారం, మార్చి 23 (విశ్వం న్యూస్): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక హెల్త్ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ వంగూరి అంజి హాజరై క్యాంప్‌ను ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డా. వై. నాగరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించింది.

క్యాంప్‌లో మొత్తం 260 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి, డాక్టర్ల సూచనల మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు సేవలు అందించారు. స్త్రీ రోగ నిపుణురాలు డా. ఆదిలక్ష్మి, దంత వైద్య నిపుణులు డా. మాతృనాయక్, కంటి వైద్య నిపుణులు డా. హరిప్రియ, ఎముకలు మరియు కీళ్ల నిపుణురాలు డా. కీతా విజయత, శిశు వైద్య నిపుణులు డా. వెంకటరమణ, జనరల్ మెడిసిన్ వైద్యులు డా. రవి ఎల్ పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో PHC సిబ్బంది, సూపర్వైజర్లు, MPHA (పురుష & మహిళా), ఆశా వర్కర్లు చురుకుగా పాల్గొని క్యాంప్‌ను విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం విశేషం.

ఇలాంటి ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *