28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నర్సింహ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ వారి సౌజన్యంతో...
బోడుప్పల్, జనవరి 29 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పెంట రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్ లో స్థానిక కార్పొరేటర్ చీరాల నర్సింహ ఆధ్వర్యంలో ఆదివారం తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పూట షుగర్ పాస్ట్, పోస్ట్ యూరిన్, రక్త పరీక్షలు, థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చీరాల నర్సింహ మాట్లాడుతూ 28వ డివిజన్ అన్ని హంగులతో అభివృద్ధిలో దూసుకుపోతున్న సందర్భంగా డివిజన్లోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఆదివారం ఏదో ఒక విధంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
నా డివిజన్ లోని ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి నా ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తున్నానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెంట రెడ్డి కాలనీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, శ్రీ సాయి ఇంక్లేవ్ ఫేస్ 1 అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,సాయి ఇంక్లేవ్ అధ్యక్షుడు శివ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చిన్నిగళ్ళ సంతోష్, 28వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు భార్గవి, ఉమా, నాయకులు ప్రజలు, కాలనీస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది యువత తదితరులు హాజరయ్యారు.