రోడ్డు ప్రమాదంలో మేకల పునీత్ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మేకల పునీత్ దుర్మరణం

శనిగరం, డిసెంబర్ 26 (విశ్వం న్యూస్): కమలాపూర్ మండల పరిధిలోని శనిగరం గ్రామానికి చెందిన మేకల తిరుపతి కుమారుడు మేకల పునీత్ యాదవ్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాలంగా మృతి చెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.

మేకల పునీత్ యాదవ్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న వయసులోనే మంచి నడవడిక, మానవీయ విలువలతో అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన అకాల వియోగం తీరని లోటుగా మారిందని పలువురు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, మిత్రులు పునీత్ యాదవ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించుగాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *