
హైదరాబాద్, జూలై 31 (విశ్వం న్యూస్) : టీఎస్ ఆర్టీసీకి కేసీఆర్ సర్కారు శుభవార్త వినిపించింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టు సర్కారు ప్రకటించింది.. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు సుదీర్ఘంగా సాగిన కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ మేరకు సంబంధిత నేతలకు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.