కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు
మంత్రి కేటీఆర్ భూమి పూజ
రంగారెడ్డి, మే 15 (విశ్వం న్యూస్) : హైదరాబాద్లోని కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతి నిధులతో కలిసి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
భూమి పూజ అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు. ఫాక్స్‌కాన్ దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో తయారీ ప్లాంట్‌లను నెలకొల్పడానికి 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ఈ పెట్టుబడితో తొలి దశలో 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కె.టి.రామారావు ట్వీట్‌లో తెలిపారు. ఆపిల్ కోసం ఎయిర్‌పాడ్‌లను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్ ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు మార్చిలో రాయిటర్స్ నివేదించింది మరియు ఉత్పత్తులను తయారు చేయడానికి భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని నిర్మించాలని యోచిస్తోంది.
ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియా పాల్గొన్నారు.