నంది అవార్డ్స్‌పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

  • ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు – నంది అవార్డ్స్‌పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 4 (విశ్వం న్యూస్) : నంది అవార్డుల పై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ఎవరు పడితే వాళ్లు అడిగితే పురస్కారాలు ఇవ్వరని మంత్రి తేల్చి చెప్పారు. అయినా సినీ ఇండస్ట్రీ నుంచి తమకు ఎవరూ ప్రతిపాదన కూడ పంపలేదని మంత్రి గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర సర్కార్ తరఫున నంది అవార్డులు ఇస్తామని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

ఈ రోజు చిత్రపురి కాలనీలో దాసరి నారాయణరావు విగ్రహం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొంత మంది సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు రీరిలీజ్‌ చేయనున్న వేళ, నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వినీదత్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *