బిఆర్ఎస్ ప్రభుత్యంలోనే రోడ్లన్నిటికి మహర్దశ : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- బోయినిపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- డప్పుచప్పుళ్ళతో ఘనస్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలు
చొప్పదండి, మార్చి 14 (విశ్వం న్యూస్) : బోయినిపల్లి మండలం స్థంభంపల్లి, గుండన్నపల్లి, విలాసాగర్ గ్రామాలలో 48 లక్షల 20వేల రూపాయల ఇజిఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంబోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రవిశంకర్ కు ఆయా గ్రామాల ప్రజలు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భముగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు బిఆర్ఎస్ హాయంలోనే మహర్దశ వచ్చిందని, బోయినిపల్లి మండలంలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో వాడ వాడలా సిమెంట్లు రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు. 2014 తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. చొప్పదండి నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుదని ఈ సందర్భముగా సుంకె రవిశంకర్ అన్నారు.