సీఎం కప్ -2023 క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

సీఎం కప్ -2023 క్రీడా పోటీలను
ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, మే 15 (విశ్వం న్యూస్) : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల లోనీ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల అవరణ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ – 2023 మండల స్థాయి క్రీడా పోటీలను కౌశిక్ రెడ్డి ప్రారంభించారు.

ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడా ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారని వెల్లడించారు.

గ్రామీణ క్రీడాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదిక అవుతుందని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *