40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చండి

40 కులాలను ఓబీసీ
జాబితాలో చేర్చండి

  • జాతీయ బీసీ కమిషన్ ను కోరిన ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

ఢిల్లీ, (విశ్వం న్యూస్) : ఢిల్లీలోని మహారాష్ట్ర సధన్ లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్ తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్ తో పాటు 40 కులాలను OBC జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ని కోరారు.

40 కులాలు OBC జాబితాలో లేకపోవటం వలన ఆ సామాజిక వర్గాలకు చెందిన బీసీలు.. కేంద్రంలో విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు ఫలాలు కోల్పోతున్నారని ఆధారలతో సహా జాతీయ బీసీ కమిషన్ కు నివేదిక సమర్పించారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలుసుకోని ఇప్పటికే పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై జాతీయ బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించి.. తెలంగాణలోని 40 కులాలను న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా.. OBC జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఎన్సీబీసీ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *