వీణవంక:దేవత మూర్తుల
ప్రతిష్టాపనకు రూ.లక్ష విరాళం
అందించిన ఎంపీపీ రేణుక

హుజురాబాద్ ఆర్సి, జూన్ 8 (విశ్వం న్యూస్): వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి,పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సమ్మిరెడ్డి, శంకర్ రెడ్డి విద్యాసాగర్, కోమల్ రెడ్డి గ్రామ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.