ఎంపీ వద్దిరాజు నూతన ఎమ్మెల్సీ
దాసోజు శ్రవణ్ కు శుభాకాంక్షలు

హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్) : శాసనమండలికి నూతనంగా ఎన్నికైన డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత, గురువారం సాయంత్రం డాక్టర్ శ్రవణ్ తెలంగాణ భవన్‌ను సందర్శించిన సందర్భంగా, ఎంపీ రవిచంద్ర గారు ఆయన్ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, “డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు తన అనుభవంతో, ప్రజలకు మేలు చేసే విధంగా శాసన మండలిలో తన సేవలను అందిస్తారని విశ్వాసం కలిగి ఉన్నాను. ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నతస్థాయికి ఎదగాలి” అని ఆకాంక్షించారు.

డాక్టర్ శ్రవణ్ కూడా ఈ సందర్భంగా తన స్పందన తెలియజేస్తూ, “తెలంగాణ అభివృద్ధికి, ప్రజాసేవకు నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను. ఈ బాధ్యతను నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరై ఎమ్మెల్సీ శ్రవణ్‌ను అభినందించారు.