
శ్రీ రేవంత్ రెడ్డి దుర్మార్గ రాజ్యంలో ‘రాఖీయిజం వద్దు రౌడీయిజం ముద్దు… కలికాల మహిమ!! :దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఆగస్టు 25 (విశ్వం న్యూస్) : మహిళా జర్నలిస్టులనే కనీస విచక్షణ, గౌరవం లేకుండా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే బారాఖూన్ మాఫ్… అసెంబ్లీలో మహిళా శాసన సభ్యులని అగౌరవ పరిస్తే బారాఖూన్ మాఫ్… కమిషన్ చైర్ పర్సన్ ని ఆఖరికి ఇంటికి రప్పించుకుని రాఖి కట్టుంచుకుంటే, బారాఖూన్ మాఫ్…

కానీ తమ దగ్గరకు వచ్చిన సోదర సమానుడైన నాయకుడికి సంప్రదాయం ప్రకారం గౌరవంతో రాఖికడితే నేరమంటున్న శ్రీ రేవంత్ రెడ్డి వైఖరి “వినాశ కాలే విపరీత బుద్ధి” అన్నట్లుంది. మనం తెలంగాణలో శ్రీ కేటీర్ ప్రోత్సహిస్తున్న గౌరవప్రదమైన రాఖీ సంస్కృతిని కోరుకుంటున్నామా? లేదా శ్రీ రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్న ప్రమాదకరమైన రౌడీ సంస్కృతిని కోరుకుంటున్నామా?
శ్రీ రేవంత్ రెడ్డి తన వక్ర మనస్తత్వంతో, కాకతీయ తొరణం మరియు చార్మినార్ వంటి ప్రతిష్టాత్మక చిహ్నాలను అధికారిక లోగోల నుంచి తొలగించడానికి ప్రయత్నించడం, తెలంగాణ తల్లిని గౌరవించకుండా ప్రవర్తించడం, మరియు ఇప్పుడు తర తరాల రాఖీ సంస్కృతిని అవమానించేందుకు చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చాల ప్రమాదకరమైనవి.
ఇలాంటి దుష్ట చర్యలతో, శ్రీ రేవంత్ రెడ్డి మన సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీయడమే కాదు, మన సామజిక అస్తిత్వాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతున్నాడు. మన సాంస్కృతిక సమగ్రతను రక్షించేందుకు, శ్రీ రేవంత్ రెడ్డి కుట్ర పూరిత వ్యూహాలను తిప్పికొట్టేందుకై, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏకమై పోరాడాలి.