కరీంనగర్:ముస్లిం సోదరులు
తప్పకుండా హజ్ యాత్రకు వెళ్లాలి

- తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి
కరీంనగర్, జూన్ 2 (విశ్వం న్యూస్) : ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. కల్మ, రోజా, నమాజ్, జకాత్ అనేవి మిగతా నాలుగు బాధ్యతలు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లా ఆదేశాల మేరకు ఇబ్రహీం ప్రవక్త హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెబుతోంది.
కరీంనగర్ జిల్లా నుండి ఈ సంవత్సరం హజ్ యాత్ర కొరకు 106 మంది ముస్లిం సోదరులు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ సబ్ రిజిస్టర్ మొహమ్మద్ మక్సుద్ అలీ కుటుంబ సభ్యులు కూడా హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో శాలువాలతో, పుష్పగుచ్చాలతో స్వీట్లు తినిపించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో ముస్లిం సోదరులు హజ్ యాత్ర చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులు మక్కాను మరియు మదీనా సందర్శించడానికి ప్రతి ఒక్కరు ప్రయాంతిస్తుంట్టారు కానీ అదృష్టములో కొంతమంది చేస్తారు మరి కొంతమంది చేయలేక పోతారు కనుక అల్లా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రతి ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్ర తప్పనిసరిగా తన జీవితకాలంలో చేయవలసిన అవసరం ఎంతో ఉందని ముస్లిం సోదరులకు పిలుపు ఇచ్చారు.
ప్రతి ముస్లిం సోదరుడు తప్పకుండా హజ్ యాత్ర చేయవలసిన అవసరం ప్రతి ఒక్క ముస్లిం పై ఉందని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా హజ్ యాత్రకు ఈ నెలలో బయలుదేరుతున్న హుజురాబాద్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ మక్సుద్ అలీ బయలుదేరుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి సంతోష్, మహమ్మద్ మతిన్, మహమ్మద్ అది, సిహెచ్ రవీందర్, కే నవాజ్ పాషా, మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్, అజీమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.