మా నాన్న నా తొలిగురువు

మా నాన్న నా తొలిగురువు

ఆత్మీయసత్కార కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : ఆత్మీయసత్కారం కార్యక్రమంలో… ఉన్నంతలో సాటిమనిషికి సహాయం చేయాలని ఆయన నేర్పిన పాఠమే నన్ను ఇప్పటికీ ముందుకు నడిపిస్తుంది. నాకు సహకరించిన ఎవరినీ జీవితంలో మరిచిపోలేదు మరిచిపోను. ఊరికి సేవచేయాలనే ఆలోచనతో మాత్రమే బుర్హానపురం సర్పంచ్ గా ఉన్నాను. మహబూబాబాద్ లో వారం రోజుల్లో ఎకరం భూమి ఇస్తే.. భూమి ఇచ్చిన ఆరునెలల్లో మహబూబాబాద్ లో ఆర్యవైశ్యభవనం కట్టించే బాద్యత పూర్తిగా నాది.

ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతిరాథోడ్, యంపి మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జెడ్పీచైర్ పర్సన్ బిందు, జిల్లాగ్రంధాలయసంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు, డిఎస్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *