బీసీల ధర్మపోరాటానికి
నా మద్దతు: మంత్రి శ్రీదేవి

హైదరాబాద్, జనవరి 26 (విశ్వం న్యూస్) : అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మంత్రి శ్రీదేవి ప్రసంగిస్తూ బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించడం సమాజంలో న్యాయం సాధనకు కీలకమైన పరిణామం. కులాల అతీతంగా బీసీ హక్కుల కోసం ఆమె సంఘీభావం వ్యక్తం చేయడం, ఓబిసిల ప్రయోజనాలపై ఆమె చూపిన దృష్టి ప్రశంసనీయమైనది.
బీసీల సమస్యలు కేవలం కులాలు సంబంధితవి కాకుండా, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధి కోసం జరగుతున్న పోరాటంగా ఆమె అవగాహన కలిగి ఉండడం, దీన్ని ప్రజలకు వివరిస్తుండటం చాలా ప్రాముఖ్యమైనది. సమాజంలో పేదరికం, విద్యా లోపం, ఉద్యోగ అవకాశాల కొరత వంటివి అధిగమించడానికి, ఓబిసిల కోసం కృషి చేయడం తప్పనిసరి అని ఆమె మద్దతు తెలియజేశారు. కులాలకు అతీతంగా దృష్టి పెట్టడం ద్వారా సామాజిక సమన్వయం, న్యాయం, సమతుల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని ఆమె పేర్కొనడం, దిశగా అవగాహన కలిగించడంలో ఆమె పాత్ర ప్రోత్సాహకరమైనది.

ఓబిసిలకు అమలులో ఉన్న నాన్‌క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని కేంద్ర డి.వో.పి.టి. గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంపుదల చేయాల్సి ఉన్నా, కేంద్రప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా పెంచడం లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 8 లక్షల నాన్-క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని 15 లక్షలకు వెంటనే పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
జనాభా గణనలో బిసి కులగణనను చేపడతామని గతంలో అప్పటి హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఎందుచేత వెనక్కి తీసుకున్నదో స్పష్టం చేయాలని ఆయన కోరారు. వచ్చే జనాభా గణనలో ఓబిసి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
జాతీయ బిసి దళ్ అధ్యకక్షుడు
దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ…
కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు ఈ వర్గాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బిసిలకు, భిక్షం వేసినట్లు 2000 కోట్లు ఏటా కేటాయించడం దుర్మార్గమని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్‌ల సాధనకు దేశవ్యాప్తంగా బిసి వర్గాల ప్రతినిధులను కూడగట్టి థల వారీగా అనేక ఉద్యమాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.