నరేష్‌తో పవిత్ర లోకేష్ పెళ్లి…

నరేష్‌తో పవిత్ర లోకేష్ పెళ్లి…

లిప్ లాక్‌తో అధికారికంగా ప్రకటన..!
హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వారిద్దరూ మీడియా ముందే మాట్లాడారు. దీంతో వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రేట్ అయ్యింది. నరేష్‌ అధికారిక ప్రకటన చేశారు. త్వరలోనే పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆమెతో కలిసి ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్ర, నరేష్ లిప్ లాక్ కూడా ఉంది. కొత్త సంవత్సరంలో, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం.. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ … నరేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *