‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆశయానికి తోడుగా ప్రకృతి ప్రేమికులు

ఆశయానికి తోడుగా
ప్రకృతి ప్రేమికులు

హైదరాబాద్, జూలై 11 (విశ్వం న్యూస్) : ‘జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి.. అందులో మొక్కలు నాటాలి, నేల బాగుండాలి, ప్రకృతిని కాపాడాలి అనుకునేవారిది అభ్యుదయమైన మనస్తత్వం అందుకోసం వారు ఎంతదూరమైన వెళ్తారు. జీవితంలో ఏం చేయడానికైన సిద్ధపడతారు’ అన్నారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అలాంటి వాళ్లలో ప్రముఖ సైక్లిస్ట్ మోహిత్ నిరంజన్, దివ్యాంగ గ్రీన్ ఎంటర్ ప్రెన్యూర్ చంద్రకాంత్ సాగర్ లది ప్రత్యేకమైన ప్రస్థానమని వారిని ప్రశంసించారు. బేగంపేటలో ఈ ఇద్దరితో కలిసి మొక్కలు నాటిన సంతోష్ కుమార్ వీరిని ఘనంగా సత్కారించాడు.

మోహిత్ నిరంజన్, 21 ఏళ్ల ఒక నవ యువకుడు.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్పూర్తితో సేవ్‌సాయిల్ & సస్టైనబిలిటీ గురించి అవగాహన కల్పించేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి మొదలుపెట్టి ఏడున్నర నెలల నుండి భారతదేశం అంతటా 6300 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం మాటల్లో వర్ణించలేనిదని.. ప్రకృతిపట్ల అపారమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని జోగినిపల్లి అన్నారు.

“ఆశయం గొప్పదైతే.. ఆటంకాలను అవలీలగా దాటవచ్చని నిరూపించాడు చంద్రకాంత్ సాగర్.. తాను దివ్యాంగుడైనా చక్రాల కుర్చీకే పరిమితం అని తెలిసినా.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అనునిత్యం శ్రమిస్తున్నాడని సంతోష్ కుమార్ అభినందించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా నాన్ వోవెన్ సంచులను తయారుచేసే సంస్థను ఏర్పాటు చేసి తనతో పాటు మరికొంత మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలిస్తున్నాడని అభినందించారు.

అనంతరం మాట్లాడిన సైక్లిస్ట్ మోహిత్ నిరంజన్.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కల ఉద్యమం తనను కదిలించిందని. మొక్కలు నాటడం వల్ల అందరికి మేలు జరుగుతున్నప్పుడు సంతోష్ కుమార్ గారు ఒక్కరే ఇంత శ్రమ ఎందుకు పడాలని నా మనసు నన్ను ప్రశ్నించిందని. దీంతో *“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్పూర్తితో సేవ్ సాయిల్ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *