మూడు పంటలు కావాలా?
మూడు గంటలు కావాలా?

- మతం పేరిట మంటలు కావాలా? హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాలి…
- కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్ట శక్తులు ఎన్ని వచ్చినా రైతులను కాపాడుకునే నాయకుడు కేసిఆర్ ఉన్నాడు ఇది రైతు రాజ్యం
వీణవంక, జూలై 23 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం రెడ్డిపల్లి క్లస్టర్ లో ఘన్ముక్ల , మల్లన్నపల్లి, రెడ్డిపల్లి, బొంతుపల్లి, క్రిష్టంపేట గ్రామల రైతులతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండల రెడ్డిపల్లి క్లస్టర్ రైతు వేదికలో పాల్గొని మాట్లాడారు.

కౌశిక్ మాట్లాడిన అంశాలు
- కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో రైతే రాజు అన్న ముఖ్యమంత్రి మీరు ఆలోచించాలి
- రైతులందరు రాత్రులంత కరెంట్ కోసం పడిగాపులు గాసిన రోజులు చూసినం
- తెలంగాణ ఉద్యమమే కరెంట్ మీద పుట్టింది రైతులను కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు కాదా
- 2001 నాడు కరెంట్ కోసం ఉద్యమం ఎత్తుకున్నది కేసీఆర్ కాదా?
- ఈ రోజు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంది కేసీఆర్ కాదా
- అయ్యా రేవంత్ రెడ్డి గారు అన్న మూడు గంటల కరెంట్ కావాలా? మత పిచ్చి లేపే బీజేపీ ప్రభుత్వం కావాలా? మూడు పంటల ప్రభుత్వం కావాలా? తెల్చుకోండి.
- కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గనికి లక్ష 17 వెల ఎకరాలకు నిరండిస్తున్న వ్యక్తి కేసీఆర్
- రైతు భీమా, రైతు బందు, 24 ఉచిత కరెంట్ తో, ఆసరా పెన్షన్, ఇతర పథకాలతో
- కౌశిక్ రెడ్డి మాటలతో ఎదో కులాన్ని దుశించినట్లు మాట్లాడుతున్నారు, కానీ ఎన్ని ఏమైనా బి ఆర్ ఎస్ జెండా హుజురాబాద్ లో ఎగురావేస్తాం
- చిల్లరగా సోషల్ మీడియా లో ఇష్టనుశారంగా వ్యవహారిస్తున్నారు.
- హుజురాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సర్వే చేస్తే కౌశిక్ గెలుస్తాడని గీర్ణించుకు పోతలేవు
- కౌశిక్ కు ఒక్క చాన్స్ ఇవ్వండి మీ అభివృద్ధి నేను చేసి చూపిస్త నా బాధ్యత.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నర్సయ్య, గన్ముకుల గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, బొంతుపల్లి గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కిష్టంపేట గ్రామ సర్పంచ్ ముత్తయ్య, జిల్లా ఎంపిటిసి ఫోరమ్ అధ్యక్షులు నాగిడి సంజీవరెడ్డి, రెడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీ భూమయ్య, బొంతుపల్లి ఎంపీటీసీ నర్సింహా రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లన్నపల్లి గ్రామ ఉప సర్పంచ్ వీరయ్య, ఘన్ముకుల ఉపసర్పంచ్ కొమరయ్య, ఇతర గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.