రాజ్‌భవన్‌లో నూతన
మంత్రుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురు నూతన మంత్రులు శనివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్‌లో చోటు కల్పించింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకకు గౌరవ వేదికగా మరెన్నో ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ మంత్రివర్గ విస్తరణతో పాలనలో కొత్త ఉత్సాహం రావడంతోపాటు సామాజిక సమీకరణాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనూ మరోసారి చాటిచెప్పినట్లైంది.