కరీంనగర్ రీజియన్ నూతన రీజనల్
మేనేజర్ పదవీ బాధ్యతల స్వీకరణ

కరీంనగర్ బ్యూరో, మే 8 (విశ్వం న్యూస్) : సోమవారం రోజున ఎన్. సుచరిత, కరీంనగర్ రీజనల్ మేనేజర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.వీరు గతంలో డిప్యూటీ సీటీఎం (ఎం అండ్ సి), టూరిజం, ప్రాజెక్ట్స్ గా, బస్ భవన్లో పనిచేస్తూ పదోన్నతిపై కరీంనగర్ రీజనల్ మేనేజర్ గా బదిలీ అయ్యారు. ప్రస్తుతము ఇంఛార్జి రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎస్. భీంరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ( మెకానికల్ ) నుండి బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) భీంరెడ్డి, వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కరీంనగర్ – 1, 2 డిపోల మేనేజర్లు ప్రణీత్, మల్లయ్య, అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, కరీంనగర్ జోన్ చంద్రయ్య, ఎం. రవీందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), రీజనల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.