అడ్వకేట్ యుగంధర్ ను
పరామర్శించిన ఎన్ఎఫ్ఎస్జే
అధ్యక్షులు గడిప నాగయ్య
బోడుప్పల్, మే 24 (విశ్వం న్యూస్) : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు గాను ఎమ్మెల్యే అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని అభయ ట్రస్ట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్న అడ్వకేట్ యుగంధర్ ను ఆల్ ఇండియా ఫౌండర్ ప్రెసిడెంట్, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు, మాదిగ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గడిప నాగయ్య పరామర్శించారు.
ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ గడిప నాగయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించుకునే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ఈరోజు ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు అడ్వకేట్ యుగేందర్ పైన తన రౌడీ మూకల చేత దాడి చేయించడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజలతో మమేకమై ఇలా దాడి చేయడం సభాబు కాదని, ఒకవేళ ఆయన ఏదైనా తప్పుగా మాట్లాడినట్లయితే పోలీసులు, న్యాయస్థానాలు ఉన్నాయని, ప్రత్యక్ష దాడులకు దిగి అతనీ మర్డర్ కు ప్లాన్ చేశారని అన్నారు. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.