నేడు బోడుప్పల్లో శ్రీ నిమిషాంబిక
దేవి మాతకు నిజాభిషేకం

శ్రీ మాత్రే నమః శ్రీ మాత నిమిషాంబికాయ నమః
బోడుప్పల్, జూన్ 3 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పెంటా రెడ్డి కాలనీ శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయం ఉప-ఆలయాల సప్తమ దశ 17వ వార్షిక బ్రహ్మోత్సవాల చివరిరోజు అమ్మవారికి 56 రకాల (పండ్ల రసాలతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో) సర్వదేవతలకు చేసిన నిజాభిషేకము కార్యక్రమన్ని తేది 04-06-2023 ఆదివారం ఉదయం 10.30_నిమిషాలకు భక్తి టీవీలో ప్రసారం చేయడం జరుగును. కావున భక్తులు వీక్షించగలరని శ్రీ మాతా నిమిషాంబ దేవి ట్రస్ట్ సభ్యులు, దేవాలయ కమిటీ చైర్మన్ వినోద్ వర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ మేరకు వినోద్ వర్మ మాట్లాడుతూ అమ్మవారికి 56 రకాల నైవేద్యాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేక కార్యక్రమం, ప్రత్యేక పూజలు, హోమాలు ఉంటాయని, ఈ కార్యక్రమంలో పాల్గొని మీ జీవితాలను చక్క దిద్దుకోవాలని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని తెలియజేశారు.