
హైదరాబాద్, జనవరి 27 (విశ్వం న్యూస్): ఎటు పోతున్నది దేశం, ఎన్ని సార్లు అడగాలి??? అడుగడుగున అంటుకునే అడుసునెలా కడగాలి ???
ఏది అసలు సరుకో తెలిసిందిపుడే అందరికి !!!
మాటలతో అణగారు సమస్యలు కావివి భాయీ, కావివి భాయి!!!
పన్నెండవ తరగతి చదివినోడు ఐఎఎస్ అధికారిని అవమానిస్తున్నాడు.
మన వ్యవస్థ దుస్థితి ఇది.
ఉన్నత చదువులు చదివి సివిల్ సర్వీసెస్ లో కొనసాగుతున్న వారిని గౌరవించాలన్న కామన్ సెన్స్ లేనోడు ఉన్నతాధికారిణిని ఉద్దేశించి కామన్ సెన్స్ ఉందా అని పరుషంగా మాట్లాడుతున్నాడు……
కాలం కలిసొచ్చి మంత్రి అయిన పొంగులేటి కన్నుమిన్ను గానక మిడిసిపడుతున్నాడు.
ఎక్కువ పొంగిన పాలు పొయ్యిపాలవుతాయని పొంగులేటి తెలుసుకోవాలి!!!!
అధికారమదంతో, దన అహంకారంతో మహిళ అనికూడా చూడకుండా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారిపై జనం సమక్షంలో పొంగులేటి నోరు పారేసుకున్నాడు.
మహిళ స్వావలంబనకోసం, ఆత్మగౌరవంకోసం, సమాన అవకాశాలకోసం సాయుధపోరులో ఆయుధమెత్తి నడిచానని చెప్పుకుంటున్న దనసరి అనసూయగారు ఈ విషయంపై నోరువిప్పాలి!!!!
తెలంగాణ మహిళా కమీషన్ పొంగులేటిపై చర్యలు తీసుకోవాలి.
ఎల్లకాలం పరిస్థితులు ఒకేలా ఉండవు.
ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.
ప్రపంచమంతా నాదే అని విర్రవీగిన హిట్లర్ అటువంటివాడే చరిత్ర పెంటకుప్పల్లోకి విసిరివేయబడ్డాడని సదరు మంత్రిగారు తెలుసుకోవాలి…..
స్త్రీని అవమానించిన రావణాసురుడు, దుర్యోధనుడు రాజ్యంతోపాటు ప్రాణాలుకూడా పోగుట్టుకున్నారు.
ఈ విషయాలన్ని పొంగులేటికి తెలియకకాదు.
అధికారం వాస్తవాలను చూడనివ్వదు.
పొంగులేటి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి.
కలెక్టర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
