తెలంగాణ గురుకులాల
నోటిఫికేషన్ తేదీని పొడిగించాలి

అభ్యర్థి, తల్లిదండ్రుల సంఘాల
జిల్లా అధ్యక్షులు గుండ్ల కుమారస్వామి
బోడుప్పల్, మే 24 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గురుకులాల ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.ఈనెల మే 24 20023 ఆఖరి తేదీ ప్రకటించారు. అంటే ఈరోజుతో ఐదు గంటలకు క్లోజ్ అయిందన్నమాట.
ఈ సందర్భంగా అభ్యర్థి మేడ్చల్ మల్కాజి జిల్లా తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులు గుండ్ల కుమారస్వామి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పిఈటి,పిడి తదితర పోస్టులకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని, అభ్యర్థులు మీసేవ, ఈ నెట్ సెంటర్స్ లకు ప్రతిరోజు గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూశారని, ఎప్పుడు కూడా వెబ్సైట్ ఓపెన్ కాలేదని ప్రభుత్వానికి విద్యాశాఖ, మంత్రికి, సాంఘిక సంక్షేమ మంత్రులు,ఇతర అధికారులకు అభ్యర్థులు రిక్వెస్ట్ చేశారు.
కాబట్టి వెబ్సైట్ ను సులభతరం చేస్తూ మరికొన్ని రోజులు సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. లేని పక్షంలో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులు తన విలువైన ఉద్యోగాలను సమయాన్ని పోగొట్టుకున్న వారు అవుతారని తెలియజేశారు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు విద్యాశాఖ అధికారులు గురుకులాల సెక్రెటరీ తదితరులు నోటిఫికేషన్ తేదీని పొడిగిస్తూ ప్రకటించాలని కోరారు.