పీర్జాదిగూడ ప్రజల ప్రాణాలతో
చెలగాటం ఆడుతున్న అధికారులు

- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, కేకే, మజార్ హాజరు
పీర్జాదిగూడ, జూన్ 1 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి ప్రాంతం వరంగల్ హైవే మీద నిత్యం జనసంచారం ఉన్న రామాలయం దగ్గర తేలికపాటి గాలి దుమారానికి భారీ హోర్డింగ్ నేలకూలింది. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం. రాబోయే రోజుల్లో బారీ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.. కావున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, నాణ్యతలేని హోర్డింగ్ లను పరిశీలించి వెంటనే తొలగించాల్సిందిగా మున్సిపల్ అధికారులను పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు.ఈసందర్భంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కవిడ కుమార్, ఒకటో డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎండీ మజార్ తదితరులు హాజరయ్యారు.