బృందన్వి బర్త్ డే సందర్భంగా అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ కు చేయుత

భవాని రాజేష్ కూతురు బృందన్వి పుట్టినరోజు పురస్కరించుకుని సహాయం
బోడుప్పల్, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈస్ట్ వెంకట్ రెడ్డి కాలనీవాసులు భవాని రాజేష్ (నాని)ల ముద్దుల కూతురు బృందన్వి పుట్టినరోజు పురస్కరించుకుని అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ లో జన్మదిన వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్గనైజేషన్ లోని విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పెన్,పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ కు ఆర్ధిక సహాయం కూడా అందించారు. స్పెషల్ అట్రాక్షన్ గా కొన్ని ఈవెంట్స్ తో పాటు మ్యాజిక్ షో కూడా నిర్వహించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ పేరెంట్స్ స్వరూప రాణి, సాంబమూర్తి, కుటుంబ సభ్యులు చైతన్య రాకేష్ రాహుల్, గంట రామకృష్ణ, విజ్ఞేష్, నర్సింహారెడ్డి, శివ నర్సింహ, తంత్రి, కాలనీ వాసులు, ఆర్గనైజేషన్ యాజమాన్యం విద్యార్థులు యువత తదితరులు హాజరయ్యారు.

