ప్రజారోగ్యంలో అర్హతలు ఉన్న వైద్యులకు
మాత్రమే అవకాశం కల్పించాలి

- కరీంనగర్ ఐయంఏ అధ్యక్షులు డా.పి.రామ్ కిరణ్
తిమ్మాపూర్, జూలై 15 (విశ్వం న్యూస్) : వైద్య వృత్తిలో అర్హత లేని వారికి శిక్షణ, సర్టిఫికెట్ ఇచ్చి వైద్యం చేయమని ప్రభుత్వమే చెప్పడం సరైన నిర్ణయం కాదని, వైద్య శాస్త్రము చదవడానికి, శరీర నిర్మాణ శాస్త్రం పట్ల, రకరకాల వ్యాధులకు, వాటికి వాడే మందులకు శరీరంలో జరిగే స్పందనలు తెలు సుకోలేని రోగం పట్ల, వాటికి వాడే మందులు, వాటి దుష్ప్రభావాలపైన అవగాహన లేని, అర్థం చేసుకునే కనీస విద్య లేని ఆర్.యం.పి, పి.యం.పి లుగా పిలువబడే వారికి అరకొర, మిడి మిడి జ్ఞానంతో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ పేరుతో సర్టిఫికెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ఐయంఏ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు దానిలో భాగంగా కరీంనగర్ జిల్లా ఐయంఏ వైద్యులు కూడా తమ వ్యతిరేకత ను తెలియజేస్తున్నారని ఐయంఏ జిల్లా అధ్య క్షులు డాక్టర్ పొలాస రామ్ కిరణ్ తెలిపారు.
అర్హత లేని వారికి ఇలాంటి సర్టిఫికెట్ లు ఇచ్చి ప్రజలకు వచ్చీరాని వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వడం వల్ల ప్రజలకు వారి కుటుంబాలకు నష్టం జరుగుతుందని కావున ఈ నిర్ణయం వెంటనే ఉపసంహరించు కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిని కూడా కోరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టు వైద్య కళాశాలల్లో సీట్లు ప్రస్తుతం మన రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో అనర్హులను కీలకమైన వైద్య రంగంలో ఉపయోగించే ప్రయోగం చేసే బదులు, వైద్య కళాశాలల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులను ప్రజా రోగ్య పరిరక్షణలో బాధ్యులను చేస్తూ వారి సేవలను ఉపయోగించుకోవాలని, వైద్య కళాశాలల నుండి వైద్య పట్టా పొందిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను చూపాలని తెలిపారు.