హుజురాబాద్ నియోజకవర్గ గులాబీ దండుకు పాడి కౌశిక్ రెడ్డి దిశా నిర్దేశం

హుజురాబాద్ నియోజకవర్గ
గులాబీ దండుకు పాడి
కౌశిక్ రెడ్డి దిశా నిర్దేశం

హుజురాబాద్/వీణవంక మే 8 (విశ్వం న్యూస్) : ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి అన్ని మండల కేంద్రాలలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, హుజురాబాద్ లలో పార్టీ బలోపేతం పార్టీలో వివిధ కమిటీల నూతన నియామక ప్రక్రియలను గూర్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

సమావేశాల్లో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ముఖ్యంశాలు:
* ప్రతి గ్రామంలో గ్రామ శాఖతో పాటు వివిధ రకాల అనుబంధ శాఖలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
* పార్టీ బలోపేతానికి గ్రామ శాఖలు, అనుబంధ శాఖలు కీలకమని అన్నారు.
* రాబోయే ఎన్నికల వరకు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అనుకొని గ్రామాల్లో పనిచేయాలని సూచించారు
* గ్రామాల్లో గ్రామ కమిటీ అనుబంధ కమిటీలతో పాటు గ్రామంలో వివిధ రంగాలలో ప్రముఖులు కుల సంఘాల ముఖ్యులు వారి వివరాలతో పాటు వారి సూచనలు సలహాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు
* ఈనెల 16వ తేదీ వరకు హుజరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి కమిటీలు వేయాలని సూచించారు.

హుజరాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని అందుకోసం పాత కొత్త అనే తేడా లేకుండా నాకు అందరూ సమానమే అని ఎమ్మెల్సీ వివరించారు. నియోజకవర్గంలో వ్యక్తిగత గ్రూపులకు తావు లేదని అందరం కేసీఆర్ గ్రూపు మనుషులమేనని అందరం బి ఆర్ ఎస్ పార్టీ జెండా కింద పనిచేయాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు పూర్తి అయిన వెంటనే మండల కమిటీలు సామాజిక న్యాయపరంగా వేయడం జరుగుతుందని అన్నారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు గౌరవ బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనుమతితో మండల కమిటీలు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
ఆసక్తి ఉన్నవారు పార్టీకోసం కష్టపడి పని చేసేవారు ఆయా మండలాల ఎంపీపీ లకు జడ్పిటిసి లకు పేర్లు ఇవ్వాలని సూచించారు. బిఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీల నాయకులు విమర్శించినప్పుడు మన పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రెస్మీట్లో సోషల్ మీడియా వేదికగా ఎక్కడికక్కడ ఖండించాలని దిశ నిర్దేశం చేశారు.

పార్టీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇతర పార్టీలలో ఉన్న నాయకులను ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి వివరించి వారికి కనువిప్పు కలిగేలా చేయాలని కౌశిక్ రెడ్డి అన్నారు. గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల నియామకంలో నియోజకవర్గస్థాయిలో మానిటరింగ్ చేయడానికి పార్టీ ఆదేశానుసారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ , కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలేని సత్యనారాయణ రావు పర్యవేక్షిస్తారని సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వివరించారు.

కౌశిక్ రెడ్డి ఏకైక లక్ష్యం హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా అందించాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ప్రతి బిఆర్ఎస్ సైనికుని పై ఉందని అన్నారు. తాను ప్రతి నాయకునికి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి గడపగడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో జెండా ఎగురవేయడానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *