బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

జమ్మికుంట/వీణవంక : జూన్ 8 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని పలు గ్రామాలలోని చల్లూర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, గ్రామాలలో ఇటీవల అనారోగ్య కారణాల వలన చనిపోయిన పలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ: 5000 /- ఐదు వేల రూపాయలను తన అనుచరులచే ఆర్థిక సహాయం అందజేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి (ఫౌండర్ & సి.ఈ.ఓ -యుప్ టి.వి & టురింటో).

ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పంజాల సతీష్, కొండపాక ఉప సర్పంచ్ రామగుండం రాజకుమార్, వీణవంక మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, జక్కు నారాయణ గౌడ్, మహమ్మద్ అఖిల్ పాషా, దండుగుల తిరుపతి, బొంగోని సదానందం, గర్వందుల దీపక్, మల్లారెడ్డి, శ్రీకాంత్, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, తాళ్ల పెళ్లి కుమారస్వామి, చిన్నాల శ్రీకాంత్, పస్తంకుమార్, బుర్ర సాగర్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *