నిరుపేద యువతి పెండ్లికి ఆర్థిక
సహాయం చేసిన పాడి ఉదయ్ నందన్

వీణవంక, మే 12 (విశ్వం న్యూస్) : చల్లూరు గ్రామానికి చెందిన ఎండి అక్రమ్ వసిల కూతురు సమా సమ్రీన్ గారి వివాహానికి గత మూడు రోజుల క్రితం నేను పాడి ఉదయ్ నందన్ రెడ్డిని చల్లూరు గ్రామంలో నిరుపేద యువతి పెండ్లికి ఆర్థిక సహాయం కోరగా వారు తక్షణం స్పందించి వారి యొక్క యాప్ టీవీ బృందానికి పంపించి ఈరోజు చల్లూరు గ్రామానికి వచ్చి ఆ నిరుపేద యువతి పెండ్లికి 10,000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో చల్లూరు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్, మాజీ సర్పంచ్ జక్కు నారాయణ గౌడ్, గూడెపు సమ్మయ్య, జామే మస్జిద్, సదర్, కాలం పాషా, ఖుబా మస్జిద్, సదర్ మొయింజని, వార్డు మెంబర్ ఎం డి అఖిల్, కుల పెద్దలు ఎండి మునీరుద్దీన్ షరీఫ్, మండల కో ఆప్షన్ నెంబర్ హమీద్, నారాయణ, అమృత, ప్రభాకర్, యుప్ టీవీ స్టాప్ పాల్గొన్నారు. ఇందుకుగాను పాడి ఉదయ్ నందన్ రెడ్డికి, చెల్లూరు ముస్లిం మైనార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.