యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

వీణవంక, జూలై 14 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన నాయకులు. నిన్న బీజేపీ బి టీం బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దగ్ధం చేయడాని కండిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధి తో పనీ చేస్తుందని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని నాయకులు అన్నారు.
కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన లక్ష రూపాల రుణ మాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ తగ్గించాలని రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం మానుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ మందు ధర్నా చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, సీనియర్ నాయకులు గంగాడి రాజీ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, అడిగొప్పుల సంపత్, యూత్ కాంగ్రెస్ నాయకులు పర్లపల్లి ప్రసాద్, చింతల హరీష్ రెడ్డి, తాళ్లపల్లి తిరుమలేష్, గుండేటి మహేష్, బుర్తుల దయాకర్, అజేయ్ తదితరులు పాల్గొన్నారు.