పాల్వంచ‌, కొత్గగూడెం మున్సిపాలిటీల‌కు రూ. 80 కోట్లు మంజూరు

పాల్వంచ‌, కొత్గగూడెం మున్సిపాలిటీల‌కు రూ. 80 కోట్లు మంజూరు

కొత్గగూడెం, జనవరి 12 (విశ్వం న్యూస్) : కొత్త‌గూడెం ప‌ట్ట‌ణం నుంచి ప్ర‌వ‌హించే ముర్రెడు వాగును కోత నుంచి కాపాడుకుంటాం. సింగ‌రేణిలో జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇప్పిస్తాం. గోదావ‌రికి అవ‌త‌ల ఉన్న ప్రాంతంలోని వారికి 3 ఫేజ్ క‌రెంట్ క‌ల్పించాం. కొత్త‌గూడెం జిల్లాలో 481 గ్రామ‌పంచాయ‌తీలు ఉన్నాయి. వీటిలో చాలా వ‌ర‌కు ఏజెన్సీ పంచాయ‌తీలు. అవి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. గ్రామ‌ పంచాయ‌తీల అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక‌ నిధి నుంచి గ్రామానికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాం. ప్ర‌జా కార్య‌క్ర‌మాల కోసం నిధుల‌ను వినియోగించాలి. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో కొత్త‌గూడెం, పాల్వంచ‌, ఇల్లందు, మ‌ణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. పాల్వంచ‌, కొత్త‌గూడెం మున్సిపాలిటీల్లో జ‌నాభా అధికంగా ఉంది. ఈ రెండు మున్సిపాలిటీల‌కు రూ. 40 కోట్ల చొప్పున‌, మిగ‌తా రెండింటికి రూ. 25 కోట్ల చొప్పున ప్ర‌త్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాం. అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *