ఘనంగా పటేల్ యూత్
ఫోర్స్ వార్షికోత్సవ వేడుకలు

- యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే… ఐకమత్య మే బలం: ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్): యువకుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని బొమ్మకల్ బైపాస్ లోని ఈ-కన్వెన్షన్ హాల్లో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం కరీంనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవ గర్జన సభను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…నేటి యువకులు మంచి విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఒక లక్షాన్ని ఏర్పరు చుకొని కష్టపడి ముందుకు సాగితే వారి కుటుంబా నికి, దేశానికి , సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారవుతారని, యువత దేశభక్తిని పెంపొందించు కోవాలన్నారు. దేశంలో పేదరికం నిర్మించడానికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని తెలిపారు.
దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. తనను గెలిపిస్తే మోడీని చేసే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలోని 27 మంది బీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మంత్రివర్గం లో స్థానం కల్పించారని తెలిపారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించడంతోపాటు ముస్లిం సంక్షేమానికి పాటుపడ్డారు అన్నారు. ట్రిపుల్ తలాక్ నిషేధించడం తో పాటు, 370 ఆర్టికల్ ను రద్దుచేసి జమ్ము కాశ్మీర్ ను ఇండియాలో కలిపేందుకు మోడీ చేసిన సేవలు దేశానికి గర్వకారణం అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జేఏసీ కన్వీనర్ విట్టల్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో పటేల్ లే ముఖ్య పాత్ర పోషించారన్నారు. హార్దిక్ పటేల్, బండి సంజయ లను పూర్తిగా తీసుకుంటే దేశంలో దేన్నైనా అధిగమించవచ్చని పిలుపునిచ్చారు.
సమాజ నిర్మా ణం నిర్మాణం కోసం యువత పాటుపడాలని సూచిం చారు. తెలంగాణలో పటేల్ యూత్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. పటేల్ యూత్ ఫోర్స్ కార్యక్రమా లకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు. తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ… రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు పయనించాలని సూచించారు. ఐకమత్యమే సంఘానికి బలమని అన్నారు. పటేల్ గెజిట్ గా తీసుకు రావడంతో పాటు హైదరాబాదు నగరంలో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయడమే అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ చక్రవర్తి, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బండి పద్మ, అడ్వకేట్ జేఏసీ నాయకులు కొమ్ము రవి పటేల్, కూరెల్లి శ్రీధర్ పటేల్, సతీష్ పటేల్, రాజేందర్ పటేల్, జర్నలిస్ట్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్ సూదుల వెంకటరమణ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామినేని మధుసూదన్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి ఆబూసీ శ్రీనివాస్ పటేల్, జిల్లా కార్యదర్శి, కొత్త సత్యనారాయణ పటేల్, సుగుణాకర్ పటేల్, చల్ల కృష్ణ పటేల్, యూత్ ఫోర్స్ నాయకులు యువకులు, మున్నూరు కాపు కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.