19న పవన్ కల్యాణ్
బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్, జూన్ 16 (విశ్వం న్యూస్) : డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. కాగా.. 19వ తేదీన జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయనకు కీలకమైన శాఖలను సీఎం చంద్రబాబు కేటాయించారు.
పవన్ కల్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలను కేటాయించడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పని తీరుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.